విద్యార్థులతో కలిసి హాస్టల్లో రాత్రి బస చేసిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR
విద్యార్థులతో కలిసి హాస్టల్లో రాత్రి బస చేసిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR
ప్రజాలహరి మిర్యాలగూడ;దామరచర్ల మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ గురుకుల పాఠశాల హాస్టల్‌ను మంగళవారం రాత్రి మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి-BLR* ఆకస్మికంగా సందర్శించారు…హాస్టల్లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, పరిశుభ్రత, భోజనాల నాణ్యత, తాగునీటి సౌకర్యం, మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆత్మీయంగా మమేకమైన ఎమ్మెల్యే, వారి విద్యాభ్యాసం, హాస్టల్లో అందుతున్న భోజనం నాణ్యత, వసతి, తాగునీటి సౌకర్యాలు, ఇతర సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు… విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, పౌష్టికాహారం అందించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు…విద్యార్థుల సంక్షేమం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. అధికారులు తరచూ హాస్టళ్లను తనిఖీ చేస్తూ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు…అనంతరం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి విద్యార్థులతో కలిసి హాస్టల్లోనే రాత్రి బస చేశారు…విద్యార్థుల దైనందిన జీవన విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, వారి సమస్యలను స్వయంగా తెలుసుకుని, అవసరమైన సదుపాయాల కల్పనకు తక్షణ చర్యలు తీసుకోవడమే ఈ ఆకస్మిక పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలిపారు…విద్యార్థుల సంక్షేమం, గురుకుల విద్యా వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం నిరంతరం కట్టుబడి పనిచేస్తోందని, ప్రతి హాస్టల్లో నాణ్యమైన సేవలు అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు…



