బ్రహ్మాకుమారీస్ ఆధ్వర్యంలో డ్రగ్-ఫ్రీ ప్రతిజ్ఞ మెగా క్యాంపెయిన్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR
ప్రజాలహరి మిర్యాలగూడ; (హరి ప్రసాద్ చీదళ్ళ)మిర్యాలగూడ పట్టణంలోని బ్రహ్మాకుమారీస్ సబ్ జోన్ ఆధ్వర్యంలో “నషా ముక్త్ భారత్ అభియాన్ & మిషన్ స్పందన్”* కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన “10 కోట్ల డ్రగ్-ఫ్రీ ప్రతిజ్ఞ మెగా క్యాంపెయిన్ (10 Crore Drug-Free Pledge Mega Campaign)” కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR ముఖ్య అతిథిగా పాల్గొన్నారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు…
అనంతరం డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగం సమాజానికి, ముఖ్యంగా యువత భవిష్యత్తుకు తీవ్ర ముప్పుగా మారుతుందని పేర్కొన్నారు… మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు… దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “10 కోట్ల డ్రగ్-ఫ్రీ ప్రతిజ్ఞ మెగా క్యాంపెయిన్” వంటి కార్యక్రమాలు సమాజంలో అవగాహన పెంపొందించడంతో పాటు యువతను సన్మార్గంలో నడిపించేందుకు ఎంతో దోహదపడతాయని అన్నారు… ఇలాంటి సామాజిక చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న బ్రహ్మాకుమారీస్ సంస్థను ఆయన అభినందించారు… ఈ కార్యక్రమంలో MLC శంకర్ నాయక్ , కాంగ్రెస్ నాయకులు, చిలుకూరి బాలకృష్ణ , గుడిపాటి నవీన్ , బ్రహ్మాకుమారీస్ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు, వివిధ సంఘాల నాయకులు, మరియు భక్తులు పాల్గొన్నారు…



