యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ముందు ధర్నాకు దిగిన భూ నిర్వాసితులు
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైం (హరిప్రసాద్ చీదళ్ళ);
నల్లగొండ జిల్లా లో ప్రతిష్టాత్మకంగా నిర్మించి వేలాది గా ఉద్యోగాలను కల్పించి విజయవంతంగా నడపబడుచున్నారు ప్లాంట్ భూ నిర్వాసితులు భూమి కోల్పోయినందుకు గాను ప్రభుత్వం తగు పరిహారాన్ని అందించినప్పటికీ జీవన భృతి కొరకు ఉద్యోగ కల్పనను వాగ్దానం చేసి ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో భూ నిర్వాసితులు అన్నమో రామచంద్ర అంటూ పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లవలసి వస్తుందని తమ గూడు వెళ్ళబోసుకుంటూ ఈరోజు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ముందు ధర్నాకు కూర్చోవడం అయినది థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభించి సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ తమకు జీవన భృతికి న్యాయం జరగలేదని వ్యవసాయ భూములు ఇచ్చాము తిండికి బాధపడుతున్నాము అని సత్వర న్యాయం కోసం నిరాహార దీక్ష కైనా వెనకడగు వేయబోమని వీర్లపాలెం, తాళ్ల వీరప్పగూడెం, శాంతినగర్, సాత్ తండ, తిమ్మాపురం దుబ్బ తండా, నర్సాపురం, తూర్పు తండా వాసులు చీఫ్ ఇంజనీర్ గారికి ఎస్సీ ఎస్టీ బీసీ లు వినతిపత్రం అందజేశారు ఇప్పటికైనా కనీసం ఈ నెలాఖరు వరకు ఉద్యోగ కల్పనకు పూనుకోవాలని విన్నవించుకున్నారు



