ప్రజాలహరి వార్తకు స్పందన మిర్యాలగూడ స్మశాన మరమ్మతులకు అధికారుల కదలిక
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్; (హరి ప్రసాద్ చీదళ్ళ); గత నెల 27వ తేదీన ప్రజాలహరి పత్రికలో ప్రచురితమైన వార్తకు స్పందిస్తూ ఈరోజు ఉదయం మిర్యాలగూడ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి చిలుకూరి సుధ బాలకృష్ణ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ గూడిపాటి శిరీష నవీన్ , మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు జవాన్లతో కలిసి మిర్యాలగూడ హిందూ శ్మశాన వాటికను సందర్శించారు.
ఈ సందర్భంగా శ్మశాన వాటికలో పరిశుభ్రత, పరిసరాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు మరియు నిర్వహణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. శ్మశాన వాటిక ఆవరణలో పెరిగిన చెత్త మొక్కలు, కలుపు మొక్కలు మరియు వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తూ ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పరిసర ప్రాంతాలను పరిశీలించి అభివృద్ధి, నిర్వహణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ శ్రీమతి చిలుకూరి సుధ బాలకృష్ణ గారు మాట్లాడుతూ, శ్మశాన వాటిక ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, ప్రశాంతమైన వాతావరణంతో ఉండేలా నిరంతర పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించినందుకు ప్రజలు హర్షద్వానాలు వ్యక్తం చేస్తున్నారు



