హాలియాలో ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు
ప్రజాలహరి హాలియా;హాలియా అంగడి బజార్లో గత కొన్ని సంవత్సరాలుగా కూరగాయలు అధిక ధరలకు అమ్ముతున్నారు వ్యాపారుల ఆగడాలకు అవధులు లేవు రైతుల నుండి ప్రత్యక్షంగా నామమాత్రపు ధరలకు కొని వినియోగదారుల నుండి అధిక ధరలు వసూలు చేస్తున్నారు ఉదాహరణకు రైతు నుండి కేజీ టమాటా మూడు నుండి 6 రూపాయల మధ్యలో కొనుగోలు చేసినా అమ్మకం ధరలుకిలో 20 రూపాయలు ఉండగా టమాట30 అమ్ముతున్నారు ఈ విధంగా అన్ని రకాల కూరగాయలకు అధిక ధరలు వసూలు చేయడం వ్యాపారస్తుల వంతు ఐంది అంతేకాకుండాఆదివారం వస్తే చాలు కూరగాయలు కొనాలంటేనే ఆకాశాన్నంటే ధరలను చూసి వణికి పోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ధరల నియంత్రణకు పాటుపడాలని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు



