రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి – కేసు నమోదు

ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్ (హరిప్రసాద్ చీదళ్ళ), మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంక్ తండాకు చెందిన ధనావత్ సేవ్య, , తన భార్య ధనావత్ కమల తో కలిసి యాక్టివా స్కూటీ నంబర్ TS 05 FF 9349పై మిర్యాలగూడ పట్టణానికి బయలుదేరి మిర్యాలగూడ పట్టణంలోని రవీంద్రనగర్ బైపాస్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో, నల్గొండ వైపు నుండి వాడపల్లి వైపు వెళ్తున్న కంటైనర్ వాహనం నంబర్ RJ 11 GC 8385 డ్రైవర్ అట్టి వాహనాన్ని అతివేగంగా మరియు అజాగ్రత్తగా నడుపుతూ యాక్టివా స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో యాక్టివా స్కూటీపై వెనుక కూర్చున్న ధనావత్ కమల తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందినది. స్కూటీ నడుపుతున్న ధనావత్ సేవ్యకు ముఖం ఎడమ వైపు మరియు ఎడమ కాలి మడమ వద్ద గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన అనంతరం కంటైనర్ వాహనం డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అక్కడి నుండి పరారయ్యాడు. ఫిర్యాదుదారుడి ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ II టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. ప్రమాదానికి కారణమైన కంటైనర్ వాహనం డ్రైవర్‌ను గుర్తించి, చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు

You May Have Missed