గుండు నరేందర్ గౌడ్‌కు ఘన సన్మానం – శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR

గుండు నరేందర్ గౌడ్‌కు ఘన సన్మానం – శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR

ప్రజాలహరి మిర్యాలగూడ (హరిప్రసాద్ చీదళ్ళ);మిర్యాలగూడ పట్టణంలోని గౌడ సంఘం భవనంలో మిర్యాలగూడ గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో నూతనంగా కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ మండల అధ్యక్షులుగా ఎన్నికైన గుండు నరేందర్ గౌడ్ కు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు… ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR ముఖ్య అతిథిగా హాజరయ్యారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు గుండు నరేందర్ గౌడ్ గారిని శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులు అంకితభావంతో పనిచేసి పార్టీని మరింత ప్రజలకు చేరువ చేయాలని ఆకాంక్షించారు… పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే దిశగా సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.. అన్ని సామాజిక వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ సేవలను అందజేయాలి అని అన్నారు.. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు గౌడ సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు…

You May Have Missed