ఫ్లై ఓవర్ నిర్మించండి ప్రజల ప్రాణాలను కాపాడండి

ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్ ;( హరిప్రసాద్ చీదళ్ళ);పట్టణానికి సమీపంలో కూడా బైపాస్ రోడ్డు ఫ్లై ఓవర్ నిర్మాణం జరగక ప్రయాణిస్తున్న అనేకమంది అమూల్యమైన తమ ప్రాణాలను కోల్పోతున్నారని సిపిఎం మండల కార్యదర్శి రవి నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక చింతపల్లి బైపాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. దీన్ని నిరసిస్తూ సమీప గ్రామ తండావాసులు అద్దంకి బైపాస్ రోడ్డు వద్ద రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు.   బైపాస్ రోడ్డులో ఫ్లైఓవర్ నిర్మించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని మరణించిన వారి కుటుంబాన్ని ఆదుకోవాలని దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎన్ని సంఘటనలు జరుగుతున్న చీమకుట్టినట్టైనా కనిపించడం లేదని వారు తెలిపారు. ప్రజా ప్రతినిధులు బైపాస్ రోడ్డు పైన ఫ్లైఓవర్ నిర్మాణాలకు పూ ను కొవా లని డిమాండ్ చేశారు.

Previous post

పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి; దళిత రత్న ముదిగొండ వెంకటేశ్వర్లు

Next post

గుండు నరేందర్ గౌడ్‌కు ఘన సన్మానం – శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR

You May Have Missed