పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి; దళిత రత్న ముదిగొండ వెంకటేశ్వర్లు
పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి తక్షణమే విడుదల చేయాలి దళిత రత్న ముదిగొండ వెంకటేశ్వర్లు MSF జిల్లా అధ్యక్షుడు
ప్రజాలహరి మిర్యాలగూడ;ఈరోజు అనుముల మండల తహశీల్దార్ చందర్ రావు గారికి MSF ( మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ) ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు ముదిగొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ … తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ , డిగ్రీ. , ఇంజనీరింగ్ , వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన ఫీజు బకాయి సుమారు 10 – 11 వేల కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయి లను దృష్టి లో ఉంచుకొని కొన్ని కాలేజీలు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని అలాంటి వాటిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు ఆదిమళ్ళ సత్య నారాయణ పాల్గొన్నారు.



