అక్రమాల అడ్డ మిర్యాలగూడ గడ్డ
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్ (చీదళ్ళ హరిప్రసాద్)
కేంద్ర ప్రభుత్వం సామాన్యుల నుంచి విఐపి ల వరకు ప్రతి పౌరునికి ఒక నిర్దిష్ట గుర్తింపు కోసం నిర్ణయించింది ఆధార్. ఈ ఆధార్ కార్డులో సాధారణంగా పేరులో తప్పులు దొర్లుతుంటాయి మరియు చిరునామా మార్పులు మొబైల్ నెంబరు మార్పులు వంటి చిన్న చిన్న సవరణల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయడం కూడా సహజమే. అయితే ఇదే అదునుగా ప్రజల నుండి అంటే సవరణలు కావలసిన వారు వారి అవసర నిమిత్తం సవరణల కేంద్రాల దగ్గరికి వచ్చిన వారి నుండి ప్రభుత్వము నిర్ణయించిన దానికంటే రెట్టింపు చార్జీలు వసూలు చేయడం బాధాకరం 75 రూపాయలు వసూలు చేయాల్సిన చోట 200 పైగా వసూలు చేస్తున్నారు ఈ విషయాన్ని ప్రభుత్వం మరియు అధికారులు పట్టిపట్టనట్టు ఉండడం వల్ల ప్రజలు దోపిడీకి గురవుతున్నారు ఈ విషయాన్ని పర్యవేక్షించవలసిన అధికారులు మౌనంగా ఉండడం వెనక ప్రజలు తమ సంశయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా అధికారులు చొరవ చూపి ఆయా ఆధార్ కేంద్రాలను పర్యవేక్షించి ప్రజలకు సరైన న్యాయం చేయవలసిందిగా కోరుచున్నారు



