నేడు ప్రపంచ స్నేహితుల దినోత్సవం
ప్రజాలహరి మిర్యాలగూడ (హరిప్రసాద్ చీదళ్ళ). స్నేహమేరా శాశ్వతం. స్నేహమేరా జీవితం…
స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ స్నేహితుల దినోత్సవాన్ని ఆదివారం మిర్యాలగూడలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్నేహితులు కలుసుకొని పరస్పరం స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకొని జీవితాంతం స్నేహంగా ఉంటూ కష్టసుఖాల్లో భాగం పంచుకుంటూ ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఒకరినొకరు స్నేహితుల బ్యాండ్ కట్టి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్,బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోతు దశరథ్ నాయక్ లు మాట్లాడుతూ మానవ జీవితంలో స్నేహానికి అత్యంత ప్రాధాన్యత ఉందని అన్నారు. మానసిక ప్రశాంతతకు ఆయుస్సు పెరుగుదలకు మంచి స్నేహం దోహదపడుతుందని తెలిపారు. స్నేహితులు రోజుకు ఒక్కరుసారైనా పరస్పరం పలకరించుకుని ఆనందంగా గడిపితే ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో కళాకారుడు నకిరేకంటి కిరణ్ కుమార్,బీసీ సంఘం పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు,జంగా లక్ష్మణ్ యాదవ్, బీసీ జేఏసీ కోకన్వీనర్ జయరాజు, రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి దుర్గయ్య,మైనార్టీ నాయకులు మహిమూద్,దేవదానం, బీసీ విద్యార్ది సంఘం నాయకులు నక్కనాగరాజు తదితరులు పాల్గొన్నారు.



