మిర్యాలగూడ పుకార్ల ప్రయాణం అభివృద్ధి శూన్యం

ప్రజల హరి క్రైమ్ మిర్యాలగూడ (హరిప్రసాద్ చీదళ్ళ); నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన ముఖ్య కేంద్రంగా విలుసిల్లుతుంది గత 30 సంవత్సరాలుగా ఎదుగుబోదుగూ లేకుండా అలాగే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన అభివృద్ధికి నోచుకోకుండా అలాగే ఉండిపోయింది గ్రామ పంచాయతీ స్థాయి నుండి నేటి వరకు ఎన్నో పార్టీలు వచ్చిన రాజకీయ నాయకుల అభివృద్ధి యే తప్ప పట్టణ పరిస్థితులు ఎటువంటి మార్పు లేకపోవడం శోచనీయం రోడ్ల వెడల్పు పట్టణ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఏ విధమైన ఎదుగుబో లేకుండా కనిపిస్తున్న ముఖచిత్రం మిర్యాలగూడ. సమస్య ఏదైనా పొత్తు కుదురునంతసేపు ధర్నాలు రాస్తారోకోలు అంటూ రోడ్ల మీదికి రావడం ఆ తర్వాత కొద్ది రోజులకే సమస్యను పట్టించుకునే నాధుడు లేకపోవడం ఒక వింత. అయితే ఈరోజు రోడ్ల వెడల్పులో భాగంగా వందల కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి రోడ్లను విస్తరిస్తున్నామంటూ చేస్తున్న పనుల్లో ఎటువంటి నాణ్యత లేకపోవడం మరియు దుస్తరిస్తున్నామంటూ చెబుతున్న దారుల వలన వాహనదారులకైన పాదచారుల కైనా ఎటువంటి ప్రయోజనం లేకపోవడం చూస్తున్న సోషల్ మీడియా గానీ మీడియా గానీ ప్రతిపక్షాలైన అధికార పక్షం కానీ మీద పార్టీల నాయకులు గానీ చూస్తూ ఉండడం తమ గళాన్ని విప్పకపోవడం సమస్యను ప్రజల్లోకి తేలేకపోవడం మిర్యాలగూడ ప్రజల దౌర్భాగ్యంగా భావించవచ్చు ఎన్నికలవేళ ప్రతి పార్టీ నాయకుడు రోడ్లమీదకు వచ్చి ప్రతి వ్యక్తిని పలంకరిస్తూ జరిగిన కాలాన్ని అన్యాయంగా చిత్రీకరిస్తూ తమ కంఠశోషను వెళ్లబుచ్చుతారే గాని ప్రజాధనం విచ్చలవిడిగా వృధా అవుతున్నప్పుడు సమస్య గురించి ఒక్కరు కూడా ప్రస్తావించకపోవడం దురదృష్టకరం ఇప్పటికైనా అధికార ఇతర పార్టీలు నాయకులు పట్టణ అభివృద్ధికి తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేయవలసిందిగా మిర్యాలగూడ ప్రజలు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. రహదారులు వెడల్పు అవుతున్నాయి అనే పేరుకే గాని దారుల వెంట డ్రైనేజీ కోసం తీసిన స్థలంలో వ్యాపారస్తులు తమ తమ వాహనాలు మరియు చిరు వ్యాపారస్తులు ఆక్రమించుకొని రహదారుల విస్తరణ జరిగింది అంటే నమ్మలేని విధంగా వాహనాల సంఖ్య పెరుగుతున్న రహదారులు వెడల్పు కాకపోవడం ఒచింత వాహనదారులను విస్మయానికి గురిచేస్తుంది కావున ప్రజా ప్రతినిధులు నాయకులు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మిర్యాలగూడ పట్టణానికి న్యాయం చేయవలసిందిగా పలువురు వాపోతున్నారు.

You May Have Missed