తల్లిపాల వారోత్సవాలలో భాగంగా అంగన్వాడి సూపర్వైజర్ ఎస్ సరిత వివరణ
ప్రజాలహరి మిర్యాలగూడ;తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఈరోజు మారేపల్లిSt Colony అంగన్వాడీ కేంద్రంలో తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సూపెర్వైసర్ S. సరిత అధ్యక్షత వహించి తల్లి పాల ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించాలి, దానినే మురుపాలు అని అంటారు, ఆ పాలలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా కలిగి ఉంటుంది, రెండు సంవత్సరాల వరకు బిడ్డకు పాలు పట్టించడం వలన తల్లికి రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది, బిడ్డకు ఆరు నెలలు వచ్చేవరకు తల్లి పాలు తప్ప వేరే ఇతర ఆహారం ఏవి ఇవ్వ కూడదని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ తల్లులు అంగన్వాడీ టీచర్ రేణుక పాల్గొనడం జరిగింది



