ఈనెల 10వ తేదీన జరిగే జైలు బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
ప్రజాలహరి మిర్యాలగూడ;ఈరోజు దామచర్ల మండలంలోని నర్సాపురం గ్రామంలో ఆగస్టు 10న జరిగే జైల్ బరో జయప్రదం చేయాలని కరపత్రాన్ని విడుదల చేసిన సిఐటియు మరియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం కార్మికులతో కలిసి కరపత్రాన్ని విడుదల చేసిన సిఐటియు మండల కన్వీనర్ బైరం దయానంద రైతు సంఘం జిల్లా నాయకులు వినోద్ నాయక్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తున్నది ఎందరో పోరాట యోధులు ప్రాణ త్యాగాలతో సాధించుకున్న దేశ స్వతంత్రాన్ని విదేశీ సంస్థలకు తాకట్టు పెట్టు తున్నారు నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో కార్పొరేటు పెట్టుబడిదారులకు మతోన్మాదులకు వ్యతిరేకంగా నేడు కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు ప్రజలు ప్రజాతంత్ర వాదులు పోరాడాలి క్విట్ ఇండియా స్ఫూర్తితో భారతదేశాన్ని కాపాడుకోవాలి అందుకోసం దేశవ్యాప్తంగా 2026 ఆగస్టు 15 రాష్ట్రవ్యాప్తంగా జైల్ బరో నిర్వహించాలని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘాలు నిర్ణయించాయి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు కార్పొరేట్ అనుకూల విధానాలను ఎండగడుతూ గ్రామ గ్రామాన బస్తీలు పారిశ్రామిక నివాస ప్రాంతాలలో విస్తృతంగా సభలు సమావేశాలు నిర్మించాలి రాష్ట్రవ్యాప్తంగా జిల్లా నిర్ణయం మండల కేంద్రాలలో జైల్ బరో కార్యక్రమంలో కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామిక వాదులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్ లు కూడా రద్దు చేయాలని రైతులు నల్ల చట్టాలను కూడా రద్దు చేయాలని కోరడం జరిగింది. అందరూ కూడా పదో తారీకు జరిగే జైల్ బరో కార్యక్రమాన్ని మండల కేంద్రానికి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో విజయ నాయకుడు గోపాలు తదితరులు పాల్గొన్నారు



