మండల వ్యాప్తంగా హోల్, రిటైల్ ఫర్టిలైజర్స్ వారు ఈ పాస్ట్ స్టాక్ రసీదులను వెంటనే పూర్తి చేయాలి. ఎం ఏ ఓ ఋషింద్రమణి
మిర్యాలగూడ ఆగష్టు 1:- ప్రజాలహరి
మిర్యాలగూడ మండల పరిధిలోని అన్ని రిటైలర్లు, హోల్‌సేల్ అవుట్లెట్లు, తమ వద్ద పెండింగ్‌లో ఉన్న ఇ -పాస్ స్టాక్ రశిదులను వెంటనే పూర్తి చేయాలని మిర్యాలగూడ మండల వ్యవసాయాధికారి ఎం. ఋష్యేంద్రమణి అన్నారు. మిర్యాలగూడ పట్టణం, మండలంలోని రిటైల్, హోల్ సేల్ ఎరువుల దుకాణాలు ఆకస్మిక తనిఖీ చేసి పెండింగ్ ఇ పాస్ రశిదులను గుర్తించి
ప్రతి స్టాక్ స్వీకరణ అనంతరం ఇ-పాస్ యంత్రంలో స్టాక్ రశిదులను ఎప్పటికప్పుడు నమోదు చేసి పూర్తి చేయడం తప్పనిసరన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లు లేకుండా 100శాతం పూర్తి చేయాలన్నారు. తనిఖీల సమయంలో పెండింగ్‌లో ఉన్న ఇ-పాస్ రశీదులు గుర్తించినట్లయితే సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోబడతాయని మండలంలోని అన్ని రిటైలర్లు, హోల్‌సేల్ డీలర్లు వెంటనే తమ ఇ- పాస్ నమోదు వివరాలను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న రశిదులు అన్ని పూర్తి చేయవలసిందిగా సూచించారు. ప్రతి రైతు ఫార్మర్స్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. రిజిస్ట్రీ చేయించని రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీ లభించదని, ఎరువులు తీసుకోలేరన్నారు. అదేవిధంగా ఎల్ నీనో ప్రభావం కొనసాగుతున్నందున తక్కువ నీటితో పండే పంటలు వేయాలన్నార



