ఆర్టీసీ గ్యారేజ్ లో కృష్ణయ్య చేసిన సేవలు మరువలేనివి   -పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపిన గ్యారేజ్ కార్మికులు-

ఆర్టీసీ గ్యారేజ్ లో కృష్ణయ్య చేసిన సేవలు మరువలేనివీ పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపిన గ్యారేజ్ కార్మికులు

ప్రజాలహరి మిర్యాలగూడ;టీజీఎస్.ఆర్టీసీలో గత 36 సంవత్సరాలు గా సూర్యాపేట,కోదాడ,దేవరకొండ, మిర్యాలగూడ ఆర్టీసీ డిపో లలో లీడింగ్ మెకానిక్ గా, సూపర్వైజర్ గా రాగోజు కృష్ణయ్య విధులు నిర్వహించి శుక్రవారం మిర్యాలగూడ ఆర్టీసీ గ్యారేజ్ లో తోటి ఉద్యోగుల అభినందనలతో అందరి చేత విశిష్ట మన్నాలను పొంది కుటుంబ ఉన్నతికి తల్లి లాంటి ఆర్టీసీ పురోభివృద్ధికి నిరంతరం శ్రమించి ఎందరికో ఆదర్శంగా నిలిచి తోటి ఆర్టీసీ కార్మికులతో కలిసి ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా డిపో మేనేజర్ రామ్మోహన్ రావు, గ్యారేజ్ ఇంచార్జీ యాదగిరి పాల్గొని మాట్లాడుతూ 36 సంవత్సరాలుగా ఆర్టీసీలో విధులు నిర్వహిస్తూ ఏనాడు ఎలాంటి తప్పిదం లేకుండా అందర్నీ కలుపుకొంటూ తన పని తాను చేసుకుంటూ సహచర ఉద్యోగులతో కలిసిమెలిసి పనిచేసేవాడన్నారు.కృష్ణయ్య మృదుస్వభావి అని, తాను ఎక్కడ ఉన్నా ఆర్టీసీ కార్మికులకు అందుబాటులో ఉంటూ సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు. కృష్ణయ్య మాట్లాడతూ ఆర్టీసీ చెట్టు లాంటిదని చెట్టు ఏ విధంగా నీడనిస్తుందో కార్మికులకు డిపో చెట్టు లాంటిదని వారన్నారు. అనంతరం ఆర్టీసీ కార్మికులతో కలిసి కృష్ణయ్య అనిత దంపతులకు పూలమాలలు వేసి శాలువాలు కప్పి హృదయపూర్వక పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ గ్యారేజ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Previous post

మిర్యాలగూడ పట్టణంలో వెంటనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాలి సిపిఎం పట్టణ కమిటీ సమావేశంలో డబ్బికార్ మల్లేష్

Next post

మండల వ్యాప్తంగా హోల్, రిటైల్ ఫర్టిలైజర్స్ వారు ఈ పాస్ట్ స్టాక్ రసీదులను వెంటనే పూర్తి చేయాలి. ఎం ఏ ఓ ఋషింద్రమణి

You May Have Missed