మిర్యాలగూడ పట్టణంలో వెంటనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాలి సిపిఎం పట్టణ కమిటీ సమావేశంలో డబ్బికార్ మల్లేష్
మిర్యాలగూడ పట్టణంలో వెంటనే ఇందిరమ్మ ఇండ్ల నిర
ప్రజల హరి మిర్యాలగూడ; (హరిప్రసాద్ చీదళ్ళ) సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు
మిర్యాలగూడ పట్టణంలో ఎంతోకాలంగా సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్న పేద, నిరుపేద కుటుంబాలు ఇందిరమ్మ ఇండ్ల అమలు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మిర్యాలగూడ పట్టణంలో వెంటనే ప్రారంభించి, అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను డిమాండ్ చేయండం జరిగింది.ఇందులో ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన వారికీ కేటాయించాలని వారు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేదలకు గృహ భద్రత కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని త్వరితగతిన అమలు చేసి, మిర్యాలగూడ పట్టణ ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలి. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్య వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సిపిఎం వన్ టౌన్ టూ టౌన్ కార్యదర్శిలు మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రవి నాయక్, రాగిరెడ్డి మంగారెడ్డి, నాయకులు తిరుపతి రామూర్తి, కోడిరెక్క మల్లయ్య, అరుణ, వెంకన్న, రామారావు, శివరాజు, వజీర్ తదితరులు పాల్గొన్నారు



