నిరుపేద కుటుంబానికి చేయూత
ప్రజాలహరి హాలియా; ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స నిమిత్తం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న అనుమల మండలం ఆలీ నగర్ కు చెందిన రావిళ్ళ శ్రీదేవి నిరుపేద కుటుంబానికి అనుమల మండల కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం 87,500 నగదును అందజేశారు. ఈ సందర్భంగా కమ్మ సేవా సమితి అధ్యక్షులు రావిళ్ళ చెన్నయ్య మాట్లాడుతూ శ్రీదేవి కుటుంబం వైద్య ఖర్చులు నిమిత్తం ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి సభ్యుల సహకారంతో సేకరించిన మొత్తాన్ని అందజేశామని, నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం కూడా అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో సభ్యులు పేలపూడి బాలకృష్ణ, విరిగినేని బబ్బి, నారాయణరావు ,జంపాల అనంతయ్య, శివకోటి వీర్రాజు, చౌదరి శీను, కోటపాటి మధుబాబు, రిమ్మలపూడి రామకృష్ణ, జంపాల దుర్గారావు, బిక్కిని వెంకట్రావు, నర్సింగ్ వెంగళరావు, చెరుకూరి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.



