విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR
విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR
మిర్యాలగూడ పట్టణంలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలల గురుకుల పాఠశాలను సందర్శించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బి ఎల్ ఆర్
ప్రజాలహరి మిర్యాలగూడ (హరిప్రసాద్ చీదళ్ళ);ఈరోజు ఆకస్మికంగా సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలల గురుకుల పాఠశాలను సందర్శించి… ఎంఈఓ (MEO), పాఠశాల స్పెషల్ ఆఫీసర్‌తో కలిసి పాఠశాలలోని విద్యా బోధన, మౌలిక వసతులు, పరిశుభ్రత, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు… అనంతరం విద్యార్థులతో ఆప్యాయంగా మమేకమైన ఎమ్మెల్యే వారి విద్యాభ్యాసం, ఎదురవుతున్న సమస్యలు, పాఠశాలలో అందిస్తున్న ఆహార నాణ్యత, ఫుడ్ మెనూ తదితర అంశాలపై స్వయంగా అడిగి తెలుసుకున్నారు… విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, వారికి అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యానికి పలు సూచనలు చేస్తూ, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనాన్ని ప్రతిరోజూ అందించాలని ఆదేశించారు… విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు… ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి- BLR మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు… మంచి విద్యతో జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు…రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్య, మెరుగైన వసతుల కల్పనకు నిరంతరం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు..



