డ్రై డే – ఫ్రైడే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన హాలియా పురపాలక సంఘం
ప్రజాలహరి హాలియా;హాలియా పురపాలక సంఘం ఆధ్వర్యంలో “డ్రై డే ఫ్రైడే” కార్యక్రమాన్ని హాలియా మున్సిపల్ కమిషనర్ కె. రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దోమల వ్యాప్తికి కారణమవుతున్న నీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి, వాటిలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది. అలాగే మురికి కాలువలలో పూడికను తొలగించి, బ్లీచింగ్ పౌడర్ చల్లడం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కె. రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ, దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను నివారించడానికి ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, తమ ఇళ్ళ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పరిశుభ్రమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ స్టాఫ్, వార్డు అధికారులు, మున్సిపల్ జవాన్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

