రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పి శరత్ చంద్ర పవర్ ఆధ్వర్యంలో తగు చర్యలు
ప్రజాలహరి మిర్యాలగూడ;గౌరవనీయులైన నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈ రోజు రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో డీటీఆర్‌బీ (DTRB) అధికారులతో కలిసి నందిపాడు గ్రామంలో వాటర్‌ట్యాంక్ తండా, ఐలాపురం మరియు నందిపాడు గ్రామాల గ్రామ రహదారి భద్రత కమిటీ సభ్యులు, సర్పంచులు మరియు కౌన్సిలర్‌లతో రహదారి భద్రతపై సమావేశం నిర్వహించి అనంతరం. రోడ్డు ప్రమాదాల నివారణలో వారి బాధ్యతలను వివరించడంతో పాటు, గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు యొక్క ప్రాముఖ్యతను మరియు మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించి అనంతరం, మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించిన రెండు బ్లాక్ స్పాట్‌లను కూడా సందర్శించామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ముందుకు కొన సాగుతున్నామని ఈసందర్భంగా రూరల్ పోలీసులు తెలిపారు

