ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా

ప్రజాలహరి మిర్యాలగూడ; భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మిర్యాలగూడ ఆర్డీవో గారికి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్ర సైదా నాయక్ మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో ఆర్డిఓ కార్యాలయానికి ఆమడ దూరంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్న ఈ ప్రభుత్వం విద్యార్థులకు పూర్తిస్థాయి విద్య అందించకుండా విద్యార్థులను మోసం చేస్తున్నారన్నారు కళాశాల ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్న ప్రతి సబ్జెక్టుకు బోధించడానికి ఉపాధ్యాయులు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు కళాశాలలో బధిర విద్యార్థులకు ఎకనామిక్స్ ఉర్దూ మీడియం విద్యార్థులకు సివిక్స్ ఎం పి హెచ్ డబ్ల్యు పారామెడికల్ ఒకేషనల్ విద్యార్థులకు లెక్చరర్లు లేకపోవడం వల్ల విద్యార్థులకు విద్య అందని ద్రాక్షలా మారుతుంది అన్నారు కళాశాలలో కనీసం కరెంటు సౌకర్యం గాని ఫ్యాన్లు గాని లేకపోవడం వల్ల విద్యార్థులు అరకురావస్తులతో విద్యను అభ్యసించే పరిస్థితి ఏర్పడిందన్నారు తక్షణమే ప్రభుత్వం ప్రభుత్వ ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా కలెక్టర్ కళాశాలను సందర్శించి సమస్యలు తెలుసుకుని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యులు మూడవత్ జగన్ వీరన్న ఝాన్సీ ఎస్ఎఫ్ఐ నాయకులు శివమణి సంతోష్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు

You May Have Missed