కోదాడ జడ్చర్ల హైవే నిర్వహణపై నిర్లక్ష్యపు నీడలు పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్ (హరి ప్రసాద్ చీదళ్ళ); కోదాడ జడ్చర్ల హైవే నిర్వహణపై నిర్లక్ష్యం నీడలు…. పట్టించుకోని ఆర్ అండ్ బీ శాఖ అధికారులు…. ఈ రహదారి కోదాడ నుంచి సాగర్ వరకు రోడ్లు విస్తారంగా అభివృద్ధి చేసినప్పటికీ వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో రహదారుల సైడ్ వాల్స్ ఉన్న రైలింగులు, మార్కులు కల్వర్టు సూచికలు అన్ని దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా శ్రీనివాస్ నగర్, తుంగపాడు మిర్యాలగూడ టౌన్ లో ఇబ్బందులు కనిపిస్తుంటాయి. మిర్యాలగూడ పట్టణంలో కోదాడ జడ్చర్ల హైవే పట్టణం గుండా వెళ్తున్నప్పటికీ రోడ్లు విస్తరణ జరిగింది నష్టపరిహారాలు కట్టారు కానీ రహదారుల నిర్వహణ మాత్రం సక్రమంగా లేదు రైలింగులు దెబ్బతింటుంది వ్యాపార సంస్థలు వెలుస్తున్నాయి చిన్నపాటి వ్యాపార సంస్థలు వాటిని స్థానికంగా ఉన్న మున్సిపల్ గాని ఆర్ ఎండ్ బీ గానీ తొలగించటం చేయడం లేదు ముఖ్యంగా మిర్యాలగూడ పట్టణంలో రహదారులు విస్తీర్ణం చేసి డ్రైనేజీలు కొద్దిగా ఎత్తు పెంచడం జరిగింది వీటి ఆవల ఉన్న వ్యాపార సంస్థలకు వెళ్లేవారు మట్టి కుప్పలు, రాళ్లు మెట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనివల్ల వచ్చిపోయే వాహనాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి పేరుకు మిర్యాల పట్టణంలో రోడ్డు విస్తరణ జరిగిన రైలింగ్ అవతల వెహికల్ పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రహదారుల వెంటనే పార్కింగ్ చేస్తున్నారు దీనివల్ల రహదారి విస్తరణ చేసిన ప్రయోజనం మాత్రం శూన్యం
ఒక గ్రామంలోనైనా పట్టణంలోనైనా అభివృద్ధి కనిపించాలంటే ముఖ్యంగా కావలసింది రహదారులే అటువంటి రహదారులను నిర్వహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక శాఖని ఆర్ అండ్ బి అనే పేరుతో నిర్వహిస్తుంది కోట్లాది రూపాయల జీతాలనుస్తూ నిధులు ఖర్చు చేస్తూ రహదారుల నిర్మాణం చేపట్టి ప్రతినిత్యం వాటి నిర్వహణ కోసం శ్రామికులను ఇచ్చి భవనాలను కూడా కేటాయించగా కనీసం ప్రభుత్వం నుండి జీతాలు తీసుకుని ఆఫీసులకే పరిమితం అవుతారే తప్ప నిర్వహణ శూన్యం కోదాడ జడ్చర్ల హైవే మిర్యాలగూడ మీదుగా వెళుతున్న విషయం ప్రజలకు తెలిసింది ఈ రహదారి మీదుగా అనునిత్యం వేలాదిగా వాహనాలు ప్రయాణిస్తుండడం గమనార్హం కానీ రహదారుల వెంట డ్రైనేజీలు ఏర్పాటుచేసి వాటిపైన ప్లాట్ఫారం కట్టి తదనంతరం ఐరన్ రైలింగ్ ను ఏర్పాటు చేసి వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వము మరియు ఇంజనీర్లు సమాస్టీ కృషితో ఏర్పాటు చేస్తే ఇప్పుడు కనీసం దాన్ని పట్టించుకున్న నాధుడే లేకపోవడం తో వ్యాపారస్తులు ఆక్రమించుకోవడం కొన్ని చోట్ల అయితే మరికొన్నిచోట్ల పిచ్చి మొక్కలు పెరిగి ప్లాట్ ఫామ్ కనబడకుండా పోతుంది ప్రతినిత్యం పరిశీలనలో ఉండవలసిన విభాగం కనీసం నెలలో ఒకరోజేనా పరిశీలనకు కరువైతుందని సుస్పష్టం అవుతుంది మరియు నిధులు కూడా దుర్వినియోగం అవుతున్నాయి అన్ని రహదారులను ప్రతినిత్యం పరిశీలించవలసిన అధికారులు కొన్నిటికి పరిమితమై మిగతా వాటిని ఉద్దేశపూర్వకంగానే వదిలివేయడం. అద్దంకి హైవే మీద ఉన్న శ్రద్ధ జడ్చర్ల హైవే మీద లేకపోవడం అత్యంత బాధాకరం ఖమ్మం కోదాడ మీదుగా ప్రభుత్వ మరియు ప్రైవేటు వాహనాలు ప్రతినిత్యం వేలాదిగా ప్రయాణిస్తున్నా అధికారులలో చలనం రావడం లేదు ఇకనైనా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి రహదారులు వాటి బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు



