🔥 ప్రజాలహరి న్యూస్ 🔥కు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి… సొంతగృహాలు లేని, కిరాయి గృహాలలో ఉండేవారు చనిపోతే వారి కర్మలు చేసుకోవడానికి నూతనంగా రెండు గృహాలు త్వరలో కట్టిస్తాం..

🔥నిర్లక్ష్యంగా హిందూ స్మశాన వాటిక అనే ప్రజాలహరి న్యూస్ 🔥 కుస్పందించిన ఎమ్మెల్యే *…………………………   .            (మిర్యాలగూడ ప్రజాలహరి). అద్దె ఇళ్ల బాధితులకు ఊరట:స్మశానవాటికలో రెండు ప్రత్యేక గృహాల నిర్మాణానికి ఎమ్మెల్యే బిఎల్ఆర్ శ్రీకారం*ప్రజాలహరి న్యూస్ వెబ్లో నిర్లక్ష్యంగా హిందూ స్మశాన వాటిక అనే వార్తకు స్పందించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి స్మశానవాటికను పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-*

అద్దె ఇళ్లలో నివాసముంటూ,కుటుంబ సభ్యుల మరణంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్న పేద,మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచేందుకు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఒక మానవీయ నిర్ణయం తీసుకున్నారు…

 

పట్టణంలోని హిందూ స్మశానవాటికలో రైస్ మిల్లర్ల సహకారంతో ప్రత్యేకంగా రెండు గృహాలను నిర్మించనున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు..

 

శుక్రవారం మిర్యాలగూడ హిందూ స్మశానవాటికను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు…

 

అద్దె ఇళ్లలో ఉంటున్న కుటుంబాల్లో ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే…ఇల్లు కీడు అవుతుందనే అంధవిశ్వాసాలతో యజమానులు మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని సంఘటనలు ఇటీవల ఎంతోమందిని కలచివేశాయి…

 

కన్నవారిని, కట్టుకున్నవారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాలు,శవాన్ని రోడ్డుపై పెట్టుకుని నరకయాతన అనుభవించిన దయనీయ పరిస్థితులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా ప్రస్తావించారు…

 

ఇలాంటి మానవీయ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనే తపనతోనే స్మశానవాటిక ఆవరణలోనే రెండు సకల సౌకర్యాలతో కూడిన గృహాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించినట్లు బిఎల్ఆర్ తెలిపారు…

 

మృతదేహాన్ని రోడ్లపై లేదా అనాథగా ఉంచాల్సిన అవసరం లేకుండా,అంతిమ సంస్కారాలు పూర్తయ్యే వరకు గౌరవప్రదంగా ఈ గృహాలలో ఉండవచ్చన్నారు.మరణించిన వారి కుటుంబ సభ్యులు,బంధువులు వేచి ఉండటానికి, ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి ఈ ఇళ్లు ఎంతో దోహదపడతాయని తెలిపారు.ఈ సామాజిక దృక్పథంతో కూడిన నిర్మాణానికి స్థానిక రైస్ మిల్లర్ల సహకారాన్ని సమీకరించి,త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు…

 

అనంతరం స్మశానవాటికలో విపరీతంగా పెరిగిన పిచ్చిమొక్కలు, ముళ్లపొదలను వెంటనే తొలగించి, ఆవరణను ఎప్పటికప్పుడు అద్దంలా శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను తీవ్రంగా ఆదేశించారు. స్మశానవాటికను అన్ని సౌకర్యాలతో వైకుంఠధామంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు…

 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.

Previous post

🔥#నిర్లక్ష్యంగా హిందూ స్మశాన వాటిక# అనే ప్రజాలహరి న్యూస్ కు స్పందించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులపై ఆగ్రహం🔥

Next post

ఖాళీ డాక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి అవసరమైన సదుపాయాలు కల్పించాలి పాలడుగు ప్రభావతి, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

You May Have Missed