🔥#నిర్లక్ష్యంగా హిందూ స్మశాన వాటిక# అనే ప్రజాలహరి న్యూస్ కు స్పందించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులపై ఆగ్రహం🔥
ప్రజాలహరి వెబ్ న్యూస్ కు స్పందించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.. మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే..
(మిర్యాలగూడ ప్రజాలహరి )(మిర్యాలగూడ ప్రజాలహరి క్రైమ్.)… మిర్యాలగూడ పట్టణంలోని” హిందూ స్మశాన వాటిక సమస్యలు ,అసౌకర్యాలు తిష్ట పరిసరాలు అపరిశుభ్రత ఒంటి అంశాలపై” @ఈ నేల 27వ తేదీన సోమవారం ప్రజాలహరి వెబ్ప న్యూస్ ప్రచురించింది.@ ఈ వార్తపై మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి స్పందించారు మిర్యాలగూడ లోని హిందూ స్మశానవాటికను
మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు…
స్మశానవాటిక పరిసరాల్లో చెట్లు అధికంగా పెరిగి ఉండటం, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడాన్ని గమనించి వెంటనే మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు…
స్మశానవాటిక పరిసరాలను ప్రతిరోజూ మున్సిపల్ కార్మికులతో శుభ్రపరచాలని, పరిశుభ్రమైన వాతావరణాన్ని నిరంతరం కొనసాగించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు…
ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే సొంత ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలు అద్దె ఇళ్లలో నివసిస్తూ కుటుంబ సభ్యుల మరణానంతరం అంత్యక్రియల సమయంలో తాత్కాలికంగా ఉండేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసింది…
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే ఉద్దేశంతో *BLR బ్రదర్స్ ఫౌండేషన్* మరియు *రైస్ మిల్లర్స్ అసోసియేషన్* సహకారంతో హిందూ స్మశానవాటిక ప్రాంగణంలో రెండు విశ్రాంతి గదులను నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR గారు ప్రకటించారు…
సొంత ఇళ్లు లేని కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోయిన సమయంలో అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఆ గదులను వినియోగించుకునేలా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు…
మానవతా దృక్పథంతో చేపడుతున్న ఈ కార్యక్రమం నిరుపేద కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుందని పేర్కొన్నారు…
ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు…
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్రం ఉపాధ్యక్షుడు కర్ణాటక రమేష్, తదితరులు పాల్గొన్నారు..



