రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బిజెపి నాయకులు

*బిజెపి వేములపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం*

వేములపల్లి ప్రజాలహరి…..వేములపల్లి మండల కేంద్రంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పెదమాం భరత్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసం కాంగ్రెస్ ముట్టడికి నిరసనగా అలాగే రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అరెస్టుకు నిరసనగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ ను స్థానిక మండల కేంద్రంలో దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షులు పెదమాం భరత్ మాట్లాడుతూనీట్ విద్యార్థుల ముసుగులో కాంగ్రెస్ పార్టీ, అల్ట్రా లెఫ్ట్ మరియు దేశ వ్యతిరేక శక్తులను కలుపుకుని దేశంలో మరోసారి విభజన రాజకీయాలకు తెరలేపుతోంది.

 

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా సభలో ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సిన రాహుల్ గాంధీ, ప్రధాని నివాసం ముందు నిరసనల పేరుతో డ్రామాలు ఆడటం ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధం. నీట్ అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నా, మాట్లాడటానికి సరైన విషయం లేకే ఆయన పార్లమెంట్ ను వదిలేసి రోడ్ల మీద నాటకాలు చేస్తున్నారు.

 

ఈ నిరసనల్లో చైనా, పాకిస్థాన్ లకు మద్దతు పలికే వ్యక్తులు, ఆర్టికల్ 370ని మళ్ళీ తేవాలని అడిగేవాళ్ళు, దేశ వ్యతిరేక నినాదాలు చేసే జమాతే ఇస్లామీ లాంటి వాళ్ళు రాహుల్ గాంధీకి మద్దతు తెలుపుతున్నారు. ఈ దేశ వ్యతిరేక శక్తుల డ్రామాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వత్తాసు పలకడం అత్యంత విచారకరంఅని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు చల్లమల్ల సీతారాం రెడ్డి జవ్వాజి సత్యనారాయణ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి పందిరి భాగ్యమ్మ, జిల్లా కార్యవర్గ సభ్యులు బోల్లేదు లవయ్య, బిజెపి వార్డు సభ్యులు పెదమాం ప్రసాద్, పగిడిపల్లి సోమయ్య,

బిజెపి సీనియర్ నాయకులు పగిళ్ల భాస్కర్, బిజెపి యువ నాయకులు ఇరుగుదిండ్ల నరేష్, పేరం విలేఖర్, ఆలకుంట్ల మధు, కుంచం మహేష్, సంతోష్, పాలడుగు శంకర్, కిషన్ నాయక్, గోపి, మహేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు

You May Have Missed