మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
వేములపల్లి( ప్రజాలహరి) నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత దేశ ప్రధాని మోడీ దిష్టిబొమ్మ గురువారం నార్కట్పల్లి అద్దంకి రహదారిపై దగ్ధం చేసి మోడీ రాజీనామా చేయాలని ధర్నా నిర్వహించారు, ఈ సందర్భంగా వేములపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలికాంత రెడ్డి మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ అయినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ఆధ్వర్యంలో ఢిల్లీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న సందర్భంలో వారిని అరెస్టు చేయడం చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు, దేశంలో ప్రధాని మోడీ అధికారం చేపట్టిన తర్వాత ప్రశ్నాపత్రాలు లీకేజీ కావడంతో ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, ముఖ్యంగా దేశంలో ప్రధాని మోడీ అధికారం చేపట్టిన తధానంతరం ఉన్నత వర్గాలను అభివృద్ధి చేయడం తప్ప పేద ప్రజలకు చేసినవి ఏమీ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, ముఖ్యంగా దేశంలో మోడీ అధికారం చేపట్టిన 12 సంవత్సరాల లో భారతదేశం ఎంతో అభివృద్ధి లోకి పోయిందని బిజెపి నాయకులు గొప్పలు చెప్పుకోవడం తప్ప, దేశంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండి అభివృద్ధికి ఆ మెడ దూరంలో ఉందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రేగటి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గంజి శ్రీనివాస్, మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టల కురుపయ్య, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు సందీప్, మాజీ సర్పంచులు, వివిధ గ్రామా శాఖల అధ్యక్షులు పుట్టల వెంకటయ్య, పల్లా వెంకటయ్య సతీష్ రెడ్డి, బొంగర్ల వినోద్, యువజన కాంగ్రెస్ నాయకులు దైవ గిరి, చంటి, సోయల్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు



