మిర్యాలగూడలో రక్తదాన శిబిరం
⭐నేడు ఉచిత రక్తదాన డొనేషన్ క్యాంప్…. (మిర్యాలగూడ ప్రజాలహరి) మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ లో గల శ్రీ సత్య సాయి సేవ మందిర్ క్యాంప్ ఆవరణంలో నేడు అనగా 24/ 7/ 2026 శుక్రవారం ఉచిత రక్త దాన డొనేషన్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమ నిర్వాహకులు చిట్యాల ప్రణీత్ ప్రకటనలో తెలిపారు. 20 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల సమూహంతో ఈ డొనేషన్ క్యాంపు నిర్వహణ చేస్తున్నట్లు వివరించారు పట్టణంలోని యువత వివిధ శాఖ చెందిన సిబ్బంది విద్యార్థినీ, విద్యార్థులుపెద్ద స్థాయిలో హాజరై వారి యొక్క రక్తమును దానం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాము. ఉదయం 10 గంటలకు బ్లడ్ డొనేషన్ శిబిరం ప్రారంభమవుతుందని సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని ఈ ప్రకటనలో వివరించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఎస్ రమణా రెడ్డి రిటైర్డ్ డిప్యూటీడిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కేసా రవి లు పాల్గొంటారు



