ఫ్లై ఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి. ప్రమాదాలను అరికట్టాలి
ప్రజాలహరి మిర్యాలగూడ ; మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు బైపాస్ వద్ద ఉన్న క్రాసింగ్ వద్ద నిత్యం ప్రమాదాల చోటు చేసుకుంటున్నాయని మంజూరైన ఫ్లైఓవర్ నిర్మాణ పనులను అధికారులు వెంటనే ప్రారంభించాలని బంజారా సంఘం నాయకులు దశరథ నాయక్, రామచందర్ నాయక్ లు కోరారు. ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయని ఇటువంటి సంఘటనలు నిత్యం చోటు చేసుకోవడంతో అనేకమంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు. ప్రమాదం జరుగుతున్న ప్రదేశాన్ని వారు పరిశీలించి మాట్లాడారు. గత నెలలో కుంటకింది తండాకు చెందిన మంగతా నాయక్ మృతి చెందగా ఆదివారం దనావత్ కమ్లి అనే మహిళ మృతి చెందిందని ఆమె భర్త సకృకు తీవ్రగాయాలు అయ్యాయని చెప్పారు. మృతి చెందిన మహిళ కమ్లి కూతురు కూడా మూడు నెలల క్రితం చింతపల్లి క్రాసింగ్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందని తెలిపారు. నందిపాడు క్రాసింగ్ వద్ద వందలాది ప్రమాదాలు చోటుచేసుకున్నాయని ప్రమాద జోన్ గా గుర్తించినప్పటికీ ఇంకను వాహనాలు వేగంగా వచ్చి బాటసారూలా మృతికి కారణమవుతున్నాయని అధికారులు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు సమావేశంలో నాని నాయక్, బంటు వెంకటేశ్వర్లు, సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.



