ఓటరు ముసాయిదా పై అవగాహన కార్యక్రమం

ప్రజాలహరి మిర్యాలగూడ ;మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఓటరు ముసాయిదాపై అవగాహన కల్పించిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి.

పట్టణంలోని 17వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో ఓటరు నమోదు, సవరణలపై కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీ నూకల వేణుగోపాల్ రెడ్డి విస్తృత అవగాహన కల్పించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈరోజు వార్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా బీఎల్ఓ (BLO), బీఎల్ఏ (BLA)లతో కలిసి స్థానిక ప్రజలకు ఓటరు జాబితా ప్రాధాన్యతను వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, జాబితాలో తప్పులు ఉంటే సరిచేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని ఏ ఒక్కరూ ఈ అవకాశాన్ని వదులుకోవద్దని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు (BLR) బ్రదర్స్ పాల్గొన్నారు.

You May Have Missed