రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
- ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన వేములపల్లి మండల కేంద్రంలోని నార్కట్పల్లి అద్దంకి రహదారిపై బుధవారం చోటుచేసుకుంది వేములపల్లి ఎస్ఐ డి వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మొల్కపట్నం గ్రామానికి చెందిన పోతన బోయిన వంశీ 19 తండ్రి సైదులు పాలిటెక్నిక్ విద్య పూర్తి చేసుకున్నాడు. వేసవి సెలవులు కావడంతో ఇంటికి వచ్చిన వంశీ బుధవారం ఉదయం మాడుగుల పల్లి మండలంలో హిందువుల గ్రామానికి ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు ఈ క్రమంలో మార్గమధ్యంలోని వేములపల్లి మండల కేంద్రంలో గల కబరస్థానం వద్దకు రాగా మిర్యాలగూడ నుంచి నల్గొండ వైపు వెళుతున్న కంటైనర్ లారీ వేగంగా వచ్చి బైకును వెనుక నుంచి ఢీ కొట్టింది అన్నారు. ఈ సంఘటనలో వంశీ బైక్ అదుపుతప్పి కింద పడిపోగా కంటైనర్ లారీ వంశీ తల మీదుగా వెళ్లడంతో తీవ్ర గాయంతో అక్కడికక్కడే మృతి చెందాడు దీనితో మృతిని తండ్రి సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి తదనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు దీనితో చేతికి అందిన కుమారుడు ఒక్కసారిగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు దిగ్భ్రాంతికి గురవుతున్న వేములపల్లి ప్రజలు



