గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి

  • *వి.జి.బి–రాంజీ జీ పథకం రద్దు చేయాలి*

 

ప్రజాలహరి మిర్యాలగూడ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికార్ మల్లేష్

రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు

 

  • కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే చర్యలను విరమించి, గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వి.జి.బి–రాంజీ జీ పథకాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు.

వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సీఐటీయూ కేంద్ర కమిటీల పిలుపు మేరకు సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు మిర్యాలగూడ లో నిరసన కార్యక్రమం నిర్వహించిన జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ పేదల జీవనాధారమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఏడాదికి 100 రోజుల ఉపాధిని సమర్థవంతంగా కల్పించాలని, పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, కూలీల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రారంభించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. రైతుల మెడకు గుదిబండగా మారుతున్నటువంటి డిస్కం లను కూడా పూర్తిగా ఎత్తివేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు మల్లు గౌతమ్ రెడ్డి, రవి నాయక్, తిరుపతి రామ్మూర్తి, కందుకూరి రమేష్ బాబు, కోట్ల శ్రీనివాస్ రెడ్డి, గాదె పద్మమ్మ, గోవిందరెడ్డి, కన్నెకంటి రామకృష్ణ, కంచి కేశవులు, వసుకుల సూర్యం,దేశిరామ్ నాయక్,గోలి వెంకటరెడ్డి,రవి, ఆశీర్వాదం, చారి,రామారావు,పాషా, సైదులు, వెంకన్న, సీతారాములు, తదితరులు పాల్గొన్నారు

You May Have Missed