రాష్ట్ర ప్రభుత్వం ప్రవేట్ పాఠశాలల పట్ల ఉదాసీనత వైఖరి ప్రదర్శించడం సరికాదు

👉 రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల పట్ల ఉదాసీనిత వైఖరీ ప్రదర్శించడం సరికాదు

 

ఫీజులను ఇష్టం వచ్చినట్లు పెంచుతూ బడుగు బలహీన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టడం సరికాదు……. బీసీ జేఏసీ పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల పట్ల ఉదాసీనత వైఖరి ప్రదర్శించడం సరికాదని బీసీ జేఏసీ పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ అన్నారు.ఈ సందర్భంగా స్థానిక మిర్యాలగూడ పట్టణంలో బీసీ జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని అలా అయితేనే బడుగు బలహీన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందని అన్నారు.ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులను ఇష్టం వచ్చినట్లు పెంచుతూ పేద విద్యార్థులకు గుది బండగా మారాయని అన్నారు. విద్యాశాఖ అధికారులు చూచి చూడనట్లు ఈ విషయంలో వ్యవహరించడం సరికాదన్నారు.

You May Have Missed