ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు.బీ ఎల్ ఆర్
ప్రజాలహరి మిర్యాలగూడ **ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR**
ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డుల్లో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో,
అలాగే దామరచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో
మిర్యాలగూడ శాసనసభ్యులు **బత్తుల లక్ష్మారెడ్డి -BLR** గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – గారు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు…
అనంతరం ఆయన మాట్లాడుతూ, **పోలియో వ్యాధి నిర్మూలనలో పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలకమైందని, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని** తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు…
ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన అన్నారు…
ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని అభినందించారు…
**ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలకు దూరం కాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని**, పోలియో నిర్మూలన లక్ష్య సాధనకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ *చిలుకూరి సుధా బాలకృష్ణ గారు,* వైస్ చైర్మన్ *గుడిపాటి శిరీష నవీన్ గార్లు*, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు…



