వర్షాకాలం సందర్భంగా పంటలు యూరియా నిలువల గురించి సమీక్ష
ప్రజాలహరి మిర్యాలగూడ వర్షాకాలం సందర్భంగా పంటలపై సమీక్ష యూనియన్ నిర్వహించి*మిర్యాలగూడ నియోజకవర్గంలో వర్షాకాలం పంటల ప్రణాళిక, యూరియా నిల్వలపై సమీక్షా సమావేశం..MLA-BLR*
ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో రానున్న వర్షాకాలం (ఖరీఫ్) సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళిక, రైతులకు అవసరమైన యూరియా మరియు ఇతర ఎరువుల సరఫరాపై..
MLA క్యాంప్ కార్యాలయం నందు
ఎమ్మెల్యే *బత్తుల లక్ష్మారెడ్డి – BLR గారి* ఆధ్వర్యంలో
వ్యవసాయ శాఖ అధికారులు, పీఏసీఎస్ (PACS) సీఈఓ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే BLR గారు మాట్లాడుతూ..
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు…
నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా, డీఏపీ మరియు ఇతర ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు…
రానున్న వర్షాకాలంలో సాగు విస్తీర్ణం, పంటల ఎంపిక, విత్తనాలు మరియు ఎరువుల అవసరాలపై అధికారులు వివరాలు అందించారు…
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సమయానికి అందేలా వ్యవసాయ శాఖతో పాటు పీఏసీఎస్ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు…
అలాగే ఎరువుల కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు…
అలాగే యూరియా యాప్ సమయాలు — యూరియా యాప్ ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు ఓపెన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి అని సూచించారు..
మండలాల వారీగా వేరు చేయాలి — యూరియా యాప్‌ను మండలాల వారీగా సెపరేట్ చేసి నిర్వహించే విధానం అమలు చేయాలని సూచించారు, తద్వారా రైతులకు సౌకర్యవంతంగా సేవలు అందుతాయని పేర్కొన్నారు… సంబంధిత మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్తాం అని అన్నారు .
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు, పీఏసీఎస్ సీఈఓ లు , సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు…



