ఇంటర్లో టాపర్ గా నిలిచిన శివాని
ఇంటర్ లో మండల టాపర్ గా శివాని
మిర్యాలగూడ దామరచర్ల ప్రజాలహరి
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో దామరచర్ల మండల కేంద్రానికి చెందిన నకిరేకంటి శివాని మండల టాపర్ గా నిలిచారు. మొదటి సంవత్సరం ఎంపిసి లో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించారు. శివాని గత సంవత్సరం పది పరీక్షలలో 550 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచారు.ప్రస్తుతం శివాని నల్గొండ గౌతమి జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నది.ఈ సందర్భంగా ఆమెను కాలేజీ యాజమాన్యం తోపాటు ఆర్యవైశ్య నాయకులు ,గ్రామస్తులు అభినందించారు.


