ప్రజాస్వామ్య హక్కుల అణచివేతకు నైతిక బాధ్యత వహించి మోడీ రాజీనామా చెయ్యాలి
నీట్ పేపర్ లీక్ కుంభకోణం, విద్యార్థులపై లాఠీచార్జీ తీవ్రంగా ఖండన – SFI,NSUI,ASFI,AIFB,AIFDSప్రజాస్వామ్య హక్కుల అణచివేతకు నైతిక బాధ్యత వహించి మోడీ రాజీనామా చెయ్యాలి -SFI,NSUI,ASFI,AIFB,AIFDS,SFI,NSUI,ASFI,AIFB,AIFDS
సంఘాల ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీక్ కుంభకోణం, విద్యార్థులపై జరిగిన పోలీసు దమనకాండ, ప్రజాస్వామ్య హక్కుల అణచివేతకు నిరసనగా మిర్యాలగూడ పట్టణంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా SFI,NSUI,ASFI,AIFB,AIFDS సంఘాల రాష్ట్ర నాయకులు రాము ఆరిఫ్ కాశి సైదా నాయక్ మాట్లాడుతూ..
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యా వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. లక్షలాది మంది విద్యార్థులు ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే, నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ ద్వారా వారి శ్రమ, ఆశలు, భవిష్యత్తుతో చెలగాటమాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కుంభకోణం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి, పరీక్షల నిర్వహణలో నెలకొన్న అవినీతికి నిదర్శనమని అన్నారు. నీట్ పేపర్ లీక్‌కు పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం, ఈ కుంభకోణంపై సమాధానం చెప్పకుండా బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. దేశంలో వరుసగా పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నప్పటికీ వాటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్‌పై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిర్వహించిన “చలో పార్లమెంట్” కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, యువజన సంఘాల నాయకులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, న్యాయం కోరుతున్న విద్యార్థులపై లాఠీలు ఎక్కుపెట్టడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేయడం బీజేపీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని విమర్శించారు. నిరుద్యోగం, విద్యా రంగ సంక్షోభం, పెరుగుతున్న ఫీజులు, పరీక్షల అక్రమాలపై సమాధానం చెప్పలేని బీజేపీ ప్రభుత్వం పోలీసు దమనకాండతో యువత గొంతును నొక్కివేయాలని చూస్తోందని ఆరోపించారు. విద్యార్థులు ఉద్యోగాలు, పారదర్శక పరీక్షా వ్యవస్థ, విద్యా హక్కుల కోసం పోరాడుతుంటే వారిని శత్రువుల్లా చూడటం సిగ్గుచేటని అన్నారు. నీట్ పేపర్ లీక్, పోటీ పరీక్షల అక్రమాలు, విద్యా వ్యవస్థలో నెలకొన్న అవ్యవస్థ కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరారు. అదేవిధంగా ప్రజల సమస్యలపై శాంతియుతంగా ఉద్యమిస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌పై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ, ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల హక్కుల కోసం పోరాడే వారిని అణచివేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ, విద్యను వ్యాపారంగా మార్చుతూ, యువత భవిష్యత్తును చీకటిలోకి నెడుతూ, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను దేశ ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నీట్ పేపర్ లీక్ కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులపై లాఠీచార్జీకి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, సోనమ్ వాంగ్‌చుక్‌ను వెంటనే విడుదల చేయాలని, బాధిత విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా నాయకులు జగన్ ప్రసన్న లోహి ఝాన్సీ AISF జిల్లా నాయకులు యశ్వంత్ nsui నాయకులు అజయ్ న్యూ మాన్ యశ్వంత్ కిరణ్ sfi నాయకులు శివ బన్నీ రవి హనుమత్ సతీష్ మనోహర్ మణి తదితరులు పాల్గొన్నారు.



