తొలి ఏకాదశి పర్వదినాన మిర్యాలగూడ ఎమ్మెల్యే బి ఎల్ ఆర్
ప్రజాలహరి మిర్యాలగూడ; తొలి ఏకాదశి పర్వదినాన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR దంపతులు తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR శ్రీమతి మాధవి తో కలిసి పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు… ముందుగా మిర్యాలగూడ పట్టణంలోని *హౌసింగ్ బోర్డు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం* లో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించారు… అనంతరం దామరచర్ల మండలం వాడపల్లి. లోని ప్రసిద్ధ శ్రీ మీనాక్షి అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం మరియు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం లను సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు… ఈ సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, నియోజకవర్గంలో శాంతి, సుభిక్షాలు నెలకొనాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు స్వామివారిని ప్రార్థించారు… అనంతరం దేవాలయాల్లో నిర్వహించిన *అన్నప్రసాదాల పంపిణీ కార్యక్రమంలో* దంపతులు పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలను అందజేశారు… భక్తులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు… ఈ కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు…



