సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సేవాభావం ఉచిత రక్తదాన శిబిరం

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సేవాభావం, ఉచిత రక్తదాన శిబిరం

మిర్యాలగూడ ప్రజాలహరి

అనారోగ్యం, ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో తోటి మానవుల ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం చేయడం గొప్ప మానవతా సేవ. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న మిర్యాలగూడకు చెందిన చిరంజీవి చిట్యాల ప్రణీత్, తన తల్లిదండ్రులు శ్రీనివాస్, పద్మ గార్లతో పాటు కుటుంబ సభ్యులు, మిత్రుల ప్రోత్సాహంతో సేవాభావాన్ని పెంపొందించుకుని, రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో శ్రీ సత్యసాయి సేవా సమితి, లయన్స్ క్లబ్ సహకారంతో ఈ ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

 

24/07/2026న మిర్యాలగూడ హౌసింగ్ బోర్డులోని శ్రీ సత్యసాయి సేవా మందిరంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరాన్ని డాక్టర్ పందిరి రవీందర్ ప్రారంభించారు.

 

ఈ కార్యక్రమంలో డాక్టర్ కె. రవి, డాక్టర్ అశ్విన్ కుమార్, డాక్టర్ జానకి రాములు, డాక్టర్ జె. రాజు, మునీర్ RMP, లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీ కూటాల. రాంబాబు, పి. గోవర్ధన్, కె. శ్రీధర్, శ్రీనివాస్ గుప్తా, కె. శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వచ్ఛంద రక్తదానం అనేది ప్రాణాలను కాపాడే మహోన్నత సేవ అని, ప్రతి ఆరోగ్యవంతుడు క్రమం తప్పకుండా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

You May Have Missed