విద్యార్థి ఉద్యమాలను అణచివేయడం సిగ్గుచేటు –  మిర్యాలగూడ లో CITU ఆధ్వర్యంలో నిరసన  CITU జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికార్ మల్లేష్ మల్లు గౌతమ రెడ్డి

విద్యార్థి ఉద్యమాలను అణచివేయడం సిగ్గుచేటు –

మిర్యాలగూడ లో CITU ఆధ్వర్యంలో నిరసన  CITU జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికార్ మల్లేష్ మల్లు గౌతమ రెడ్డి

ప్రజాలహరి మిర్యాలగూడ;.    ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యా వ్యవస్థలో నెలకొన్న సంక్షోభం, NTA వైఫల్యాలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, NTA రద్దు వంటి డిమాండ్లతో విద్యార్థులు, యువత చేపట్టిన ఉద్యమాలకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతున్న వేళ, విద్యార్థులపై నిరసనకారులపై లాఠీచార్జ్ చేయడం బిజెపి ప్రభుత్వానికి పరాకాష్ట అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికార్ మల్లేష్, మల్లు గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.  NEET, CUET తదితర పరీక్షల నిర్వహణలో తలెత్తిన తీవ్రమైన సమస్యలు, NTAపై విశ్వాస సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై నాటి చార్జి భాష వాయువులు ప్రయోగించడం దారుణమని చర్యని వారి పేర్కొన్నారు. ఇంత జరుగుతున్న నరేంద్ర మోడీ మౌనంగా ఉండడం దారుణం. విద్యార్థుల ప్రాణాలు పోయినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం అమానుషం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి.      రాష్ట్రాల హక్కులను హరిస్తూ విద్యను కేంద్రీకరిస్తున్న NTA వ్యవస్థను వెంటనే రద్దు చేసి, పారదర్శకమైన, రాష్ట్రాల హక్కులను గౌరవించే ప్రవేశ పరీక్షల విధానాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.    జంతర్ మంతర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జీ చేయడం, వాటర్ క్యానన్లు ప్రయోగించడం వంటి అణచివేత చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధమైనవి. నిరసన తెలిపే హక్కును హరించే ఇటువంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాలని తెలిపారు.    ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రామచంద్ర, వల్లపు రావ్, శ్రీను, నగేష్, కిరణ్, సోమ్లా, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు

Previous post

మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారి అధ్వర్యంలో.. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

Next post

 ఎల్-వినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి – సమీక్షా సమావేశంలో మంత్రులు

You May Have Missed