ఎల్-వినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి – సమీక్షా సమావేశంలో మంత్రులు

ఎల్-వినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి – సమీక్షా సమావేశంలో మంత్రులు

 

ప్రజాలహరి మిర్యాలగూడ;ఈరోజు నల్గొండ కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవనం లో    తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్-వినో ప్రభావాన్ని ఎదుర్కొనే సంసిద్ధత, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం మరియు సంబంధిత అంశాలపై”. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు..  ఈ సమావేశానికి ఇరిగేషన్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి రోడ్లు & భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు నల్గొండ జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు* హాజరై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు…   ఎల్-వినో ప్రభావం వల్ల ఏర్పడే వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులకు అనుకూలమైన *ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించడం, సాగునీటి నిర్వహణ, నీటి వనరుల సమర్థ వినియోగం, వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించడం, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ముందస్తు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని. మంత్రులు అధికారులను ఆదేశించారు..   ఈ సమీక్షా సమావేశంలో *మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు…   రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

Previous post

విద్యార్థి ఉద్యమాలను అణచివేయడం సిగ్గుచేటు –  మిర్యాలగూడ లో CITU ఆధ్వర్యంలో నిరసన  CITU జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికార్ మల్లేష్ మల్లు గౌతమ రెడ్డి

Next post

పోలీసు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట: డీజీపీ సి.వి. ఆనంద్

You May Have Missed