భూముల రీ-సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR

  • ప్రజాలహరి మిర్యాలగూడ : భూముల రీ-సర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR

ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భూముల రీ-సర్వే కార్యక్రమం. పై అవగాహన కల్పించేందుకు పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా అడవిదేవులపల్లి మండలం ఉల్సాయిపాలెం గ్రామం, దామరచర్ల మండలం నర్సాపురం గ్రామం మిర్యాలగూడ మండలం కిష్టాపురం గ్రామం  వేములపల్లి మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామం, మాడ్గులపల్లి మండలం గండ్రవాణిగూడెం గ్రామాలను  ఎంపిక చేసి అవగాహన కల్పిస్తూ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు  బత్తుల లక్ష్మారెడ్డి -BLR  ఆర్డీవో  రమణారెడ్డి  గారు పాల్గొని… భూముల రీ-సర్వే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, విధానం, ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ,

ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి గారి  నాయకత్వంలో రెవెన్యూ శాఖ మంత్రివర్యులు  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి* సహకారంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు… ఈ కార్యక్రమం ద్వారా భూముల సరిహద్దులు స్పష్టంగా నిర్ణయించబడటంతో పాటు భూ రికార్డులు ఆధునికీకరించబడతాయని, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు… రైతులు, భూ యజమానులు రీ-సర్వే ప్రక్రియకు పూర్తిస్థాయిలో సహకరించాలని, అధికారులు గ్రామాలకు వచ్చినప్పుడు అవసరమైన పత్రాలు అందించి ఖచ్చితమైన వివరాలు నమోదు చేయించుకోవాలని కోరారు… ప్రజల భూ హక్కులను పరిరక్షించడం, భవిష్యత్ తరాలకు వివాదరహిత భూ రికార్డులు అందించడం తెలంగాణ ప్రభుత్వ పేర్కొన్నారు. ఆర్డీవో రమణారెడ్డి గారు రీ-సర్వే నిర్వహణ విధానం, సాంకేతిక ప్రక్రియ, ప్రజలు పాటించాల్సిన సూచనలపై గ్రామస్తులకు వివరించి, ఎలాంటి సందేహాలు ఉన్నా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో  MLC శంకర్ నాయక్ గారు, సర్పంచ్ లు, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతులు, భూ యజమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

You May Have Missed