మిర్యాలగూడ ఫ్లై ఓవర్ దగ్గర బహిరంగ శౌచాలయ ఏర్పాటుకు శంఖుస్థాపన

ప్రజాలహరి మిర్యాలగూడ; మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఫ్లై ఓవర్ క్రింద ప్రజల సౌకర్యార్థం నూతనంగా నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్ (బహిరంగ శౌచాలయం) నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) DCC ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిపాటి నవీన్ కుమార్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి గారు, కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి గార్లు శంకుస్థాపన చేయడం శుభపరిణామం.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పట్టణంలో రద్దీగా ఉండే ఫ్లై ఓవర్ పరిసర ప్రాంతాల్లో ప్రజా అవసరాలను గుర్తించి, ఈ పబ్లిక్ టాయిలెట్ నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా ప్రయాణికులకు, స్థానిక వ్యాపారులకు మరియు ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. పట్టణ పరిశుభ్రతకు, పారిశుద్ధ్య మెరుగుదలకు ఈ చర్య ఎంతగానో దోహదపడుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు, నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

You May Have Missed