ఈనెల 17న ఏఐకేఎస్ సన్నాహక సమావేశం
ప్రజాలహరి మిర్యాలగూడ;17వ తేదీన నల్లగొండలో ఏఐకేఎస్ సన్నాహక సమావేశం.ఈ సంవత్సరం నవంబర్ 18 నుండి 21 వరకు నల్లగొండలో జరుగు 36వ జాతీయ మహాసభల గాను 17వ తేదీన ఆహ్వాన సంఘ సన్నాహక సమావేశం నల్గొండ జిల్లా కేంద్రం ఏచూరి గార్డెన్ లో జరగనున్నట్లు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం నాడు స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాసభల్లో రైతులు దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారానికి చేయాల్సిన ఉద్యమాలకు రూపకల్పన చేయనున్నట్లు ఆయన తెలిపారు. అఖిలభారత కిసాన్ సభ సమావేశాలు జయప్రదం చేయాలని అందుకు రైతులు పారిశ్రామికవేత్తలు సహకరించాలని వా రు కోరారు. సన్నాహక సమావేశానికి ఏఐకేఎస్ అఖిలభారత ప్రధాన కార్యదర్శి వి జూ కృష్ణన్ హాజరవుతున్నట్టు వారు తెలిపారు. వీరితోపాటుగా ఏఐకేఎస్ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. సమావేశాని కి వ్యవసాయ శాస్త్రవేత్తలుఅ దాస్ జానయ్య హరి బండి ప్రసాద్ రావు హాజరవుతున్నట్లు తెలిపారు.సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రాగిరెడ్డి మంగారెడ్డి సిఐటియు రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లు గౌతమ్ రెడ్డి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు ముత్యాల లక్ష్మీనారాయణ చేనేత సంఘం రాష్ట్ర నాయకులు భావండ్ల పాండు చెన్నబోయిన ఎంకన్న జానీ పాషా తదితరులు పాల్గొన్నారు..



