ఈనెల 10న కొత్తగూడెం లోని రైతు వేదిక లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో టెలికాన్ఫరెన్స్
*ఈనెల 10న జరిగే రైతు భరోసా ఆశీర్వాద మహాసభ టెలికాన్ఫరెన్స్ లోముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి….
మిర్యాలగూడ ప్రజాలహరి….తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలో రూ.9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా 10-07-2026 (శుక్రవారం) కొత్త గూడెం రైతు వేదిక ,మిర్యాలగూడ మండలంలో నిర్వహించబడనున్న **”రైతు ఆశీర్వాద సభ”**కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొననున్నారు
ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం (Live Video Conference) చేయనున్నందున, మా మండలంలోని రైతులు, గౌరవ ప్రజాప్రతినిధులు మరియు మీడియా ప్రతినిధులు అందరూ తమకు సమీపంలోని రైతు వేదికకు మధ్యాహ్నం 1.00 గంటలకే విచ్చేసి కార్యక్రమాన్ని వీక్షించి విజయవంతం చేయవలసిందిగా మనవి.
తేదీ: 10-07-2026 (శుక్రవారం)
సమయం: మధ్యాహ్నం 1.00 గంటల నుండి
కార్యక్రమం: రైతు ఆశీర్వాద సభ ప్రత్యక్ష ప్రసారం
వేదిక: సంబంధిత రైతు వేదిక
మీ విలువైన హాజరుతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మిర్యాలగూడ వ్యవసాయ శాఖ అధికారిణి రుష్యేంద్రమణి ప్రకటన విడుదల చేశారు



