కొత్తగూడెం రైతు వేదికగా.. రైతులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్…. ఈనెల 10వ తేదీన రైతు భరోసా నిధులు విడుదల సందర్భంగా ఆశీర్వాద కార్యక్రమం

⭐రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్….*ఈనెల 10న కొత్తగూడెం(మిర్యాలగూడ)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి -రైతులతో వీడియో కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్…..
మిర్యాలగూడ ప్రజాలహరి….తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలో రూ.9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా 10-07-2026 (శుక్రవారం) కొత్త గూడెం రైతు వేదిక ,మిర్యాలగూడ మండలంలో నిర్వహించబడనున్న **”రైతు ఆశీర్వాద సభ”**కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2.00 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటా
ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం (Live Video Conference) చేయనున్నందున, మా మండలంలోని రైతులు, గౌరవ ప్రజాప్రతినిధులు మరియు మీడియా ప్రతినిధులు అందరూ తమకు సమీపంలోని రైతు వేదికకు మధ్యాహ్నం 1.00 గంటలకే విచ్చేసి కార్యక్రమాన్ని వీక్షించి విజయవంతం చేయవలసిందిగా మనవి.
తేదీ: 10-07-2026 (శుక్రవారం)
సమయం: మధ్యాహ్నం 1.00 గంటల నుండి
కార్యక్రమం: రైతు ఆశీర్వాద సభ ప్రత్యక్ష ప్రసారం
వేదిక: సంబంధిత రైతు వేదిక
మీ విలువైన హాజరుతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మిర్యాలగూడ వ్యవసాయ శాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు

You May Have Missed