తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి
ప్రజాలహరి మిర్యాలగూడ;
తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి
తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక పాత్ర పోషించిన ఉద్యమకారులకు ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ చర్యలు చేపట్టి వారికి గుర్తింపు గౌరవం కల్పించాలని నల్గొండ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమ నాయకులు అన్ని బోయిన మట్టయ్య కోరారు గురువారం హైదరాబాద్లోని తెలంగాణ అమర జ్యోతి ప్రాంగణంలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ప్రత్యేక సమావేశం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాములు కలిసి తమ డిమాండ్లను వివరించారు తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ఉన్నత స్థాయి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇండ్ల స్థలం ఉద్యమకారుల గుర్తింపు కార్డు ప్రత్యేక పెన్షన్ మంజూరు చేయాలని కోరారు అలాగే ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు ఉద్యమకారుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని స్వయం ఉపాధి కోసం ప్రభుత్వ రాయితీ తో కూడిన ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ఉద్యమకారుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్సీ కోదండరాం ను విజ్ఞప్తి చేశారు.



