మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి ఎమ్మెల్యే బిఎల్ఆర్
మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి**
వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – B LR
బత్తుల లక్ష్మారెడ్డి – BLR గారి అధ్యక్షతన. రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, ఎలక్ట్రికల్, జాతీయ రహదారుల (NH) శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ప్రతి పనిపై శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సూచించారు… రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాలు, విద్యుత్ సంబంధిత పనులు, సాగునీటి ప్రాజెక్టులు, మున్సిపల్ అభివృద్ధి పనులు, జాతీయ రహదారుల పరిధిలో ఉన్న సమస్యలు తదితర అంశాలపై అధికారులతో సవివరంగా సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని, శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల ఎలాంటి అభివృద్ధి పనులు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు… ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సకాలంలో అందేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.. అధికారులు తమ శాఖలకు సంబంధించిన పెండింగ్ పనుల పురోగతిని ఎమ్మెల్యేకు వివరించగా, త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు..



