నందిపాడు బైపాస్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కమ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే బి ఎల్ ఆర్

·ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్ ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు జంక్షన్ నందు రోడ్డు ప్రమాదంలో వాటర్ ట్యాంక్ తండాకి చెందిన కమ్లి , ఘటన స్థలంలో చనిపోవడం జరిగింది.. వారి భర్త సక్రు కాలు విరిగి తీవ్రంగా గాయపడడం జరిగింది..       విషయం తెలుసుకున్న శాసనసభ్యులు  బత్తుల లక్ష్మారెడ్డి -BLR  ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన సక్రు ని హాస్పిటల్ కి తరలించి దగ్గరుండి ఫస్ట్ ఎయిడ్ చేయించి స్కానింగ్ చేయించి వారికి చికిత్స చేయించడం జరిగింది…   కమ్లి  మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ.. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలియజేసారు..

You May Have Missed