ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల వసతులు కల్పించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా

ప్రజాలహరి మిర్యాలగూడ

ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ సకాలంలో యూనిఫాంలో అందించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కంభంపాటి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ చేపట్టిన ధర్నాలో పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించి 20 రోజులు కావస్తున్న పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో విద్యార్థులు అసౌకర్యాలకు గురవుతున్నారని వాపోయారు పాలకులు ప్రభుత్వాలు మారిన పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలను దుస్థితి మాత్రం మారడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాలల విద్యార్థులు ఆకలి తీరుస్తున్న మధ్యాహ్నం భోజన కార్మికులకు కనీస వేతనాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు తక్షణమే ప్రభుత్వ పాఠశాలల్లోనూ చదువుతున్న విద్యార్థులకు రెండు చేతుల యూనిఫాంలో అందించడంతోపాటు కనీస మౌలిక వరుదులు కల్పించాలన్నారు లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు అనంతరం తహసిల్దార్ హేమలతకు వినతిపత్రం అందించారు కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి కుర్ర సైదా నాయక్ మండల కార్యదర్శి పుట్ట సంపత్ అంజి శీను మనోజ్ వరుణ్ తదితరులు పాల్గొన్నారు

You May Have Missed